ఆధ్యాత్మికం : హనుమత్ జయంతి ఎప్పుడు.. ఆరోజు ఏంచేయాలి.. ఏఏ మంత్రాలు చదవాలి.. 

ఆధ్యాత్మికం : హనుమత్ జయంతి ఎప్పుడు.. ఆరోజు ఏంచేయాలి.. ఏఏ మంత్రాలు చదవాలి.. 

ధైర్యానికి, విజయానికి ప్రతీకగా హనుమంతుడిని కొలుస్తారు.  మంగళవారం .. శని వారాలు హనుమంతుడిచి చాలా ఇష్టమైన రోజులు. అంతే కాదు హనుమజ్జయంతి రోజున దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు.  పురాణాల ప్రకారం వైశా బహుళ దశమి రోజున హనుమంతుడు  కేసరి.. అంజనాదేవికి జన్మించాడు.  ఈ సంవత్సరం (2026) మే 12 . మంగళవారం  హనుమాన్ జయంతి రానుంది.  మరి ఇంతకు పూజా సమయం ఎప్పుడు.. పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం..

పరాభవ నామ సంవత్సరంలో వచ్చే హనుమాన్ జయంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం వైశాఖ బహుళ దశమి ( 2026 మే 12) ఆ రోజున హనుమంతుడిని పూజిస్తారు. కలియుగంలో కూడా హనుమాన్ అమరత్వం కలిగి ఉంటారని నమ్ముతారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల చాలా సమస్యలు తొలగి పోతాయి. అలాగే ఈ రోజున భక్తులు అనేక పరిహారాలను పాటిస్తారు.

హనుమాన్ జయంతి ఎప్పుడు? 

ఈఏడాది ( 2026)  హనుమాన్ జయంతి పండుగను  మే 12 న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం వైశా బహుళ దశమి మే 11 ఉదయం 10:17  గంటలకు ప్రారంభమవుతుంది. మే 12  (మంగళవారం) ఉదయం 9:55 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిధి ప్రకారం 2026మే 12 న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

ఎలా పూజించాలి

  • హనుమాన్ జయంతి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేయాలి.
  • దగ్గర్లో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధూరం సమర్పించాలి.
  •  హనుమాన్‌తో పాటు శ్రీ సీతారాములను పూజించాలి.
  •  ఎర్ర చందనం, అక్షింతలు, పూలు, ధూప దీపాలు, బట్టలు, పండ్లు తదితర వాటిని హనుమంతుడికి సమర్పించాలి.
  •  హనుమాన్ జయంతి వేళ హనుమాన్ చాలీసా, సుందరకాండ పఠించాలి.
  • పూజ పూర్తయిన తర్వాత హారతి ఇచ్చి, ప్రసాదాన్ని అందరికీ పంచాలి.
  •  హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ‘‘ఓం హం హనుమాన్ నమః’’ ‘‘ఓం నమో భగవతే హనుమాన్ నమః’’ అనే మంత్రాలను జపించాలి.
  •  హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉండి నేలపైనే నిద్రించాలి
  • స్వామికి అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. 
  • హనుమాన్ జయంతి రోజు  ఆంజనేయస్వామి అవతారంగా భావించే కోతులకు బెల్లాన్ని ఆహారంగా ఇవ్వాలి.
  •  దానాలు చేయటం కూడా మంచిది. దానాలు చేయటం వల్ల మన సమస్యలు తొలికి, ప్రశాంతత లభిస్తుంది.
  • హనుమంతుడికి సింధూరం అర్పిచటం వల్ల మంచి జరుగుతుంది.
  • పవిత్రమైన ఈ రోజున శృంగారం, మాంసం, మద్యం, పొగతాగడం  వంటి వాటికి దూరంగా ఉండాలి.
  • ఎర్రని పూలు, నెయ్యి, నువ్వుల నూనెతో దేవుడికి అర్చన చేయటం వల్ల శుభం కలుగుతుంది.

హనుమంతుని జీవితమంతా శ్రీరాముని సేవకే అంకితమైంది. ఆయనకు శక్తి, జ్ఞానం, విజయాలు కేవలం సాధనాలు మాత్రమే. భగవంతునికి సేవ చేయడమే ఆయన ప్రాథమిక లక్ష్యం. ఆయన తన బలాన్ని ఎప్పుడూ అహంకారంతో ప్రదర్శించలేదు...  కానీ ప్రతి పనిలో వినయానికి, అంకితభావానికి ప్రాధాన్యత ఇచ్చారు. తులసీదాస్ ఆయనను మహాప్రభు ..  మహాతపస్వి అని పిలిచారు.  ఆయన త్యాగం .. సేవ .. ఆదర్శాల కారణంగానే ఈ విశ్వంలో నేటికీ నిలిచి ఉన్నారు. అందుకే ఆయనను కేవలం బలానికి ప్రతీకగా మాత్రమే కాకుండా.. ఒక ఆదర్శ భక్తుడిగా కూడా పూజిస్తారు.