సత్యదేవ్‌‌తో కలిసి నటించడం హ్యాపీ : తమన్నా

సత్యదేవ్‌‌తో కలిసి నటించడం హ్యాపీ : తమన్నా

‘గుర్తుందా శీతాకాలం’ లాంటి పూర్తి స్థాయి లవ్‌‌ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది తమన్నా. సత్యదేవ్‌‌తో కలిసి ఆమె నటించిన ఈ చిత్రానికి నాగశేఖర్ దర్శకుడు. చింతపల్లి రామారావు, భావన రవి నిర్మాతలు. ఈనెల 9న సినిమా విడుదలవుతోన్న సందర్భంగా తమన్నా ఇలా ముచ్చటించింది.

  •  హీరోయిన్స్ అన్నాక కెరీర్‌‌‌‌ ప్రారంభంలో మాత్రమే లవ్‌‌ స్టోరీ చేస్తారనేది ఒకప్పటి మాట. కాలం మారింది. రిలేషన్ షిప్స్ కూడా మారాయి. అలాంటి ఓ కాంటెంపరరీ స్టోరీనే ఇది. ప్రేమ అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే కలిగేది కాదు. ప్రేమలో పడిన ప్రతిసారి వ్యక్తుల ఆలోచన తీరులో మార్పు వస్తుంటుంది అనేది కాన్సెప్ట్‌‌. మొత్తంగా ఇదొక ఎమోషనల్‌‌ జర్నీ. 
  • కన్నడలో సూపర్ హిట్ అయిన ‘లవ్‌‌ మాక్‌‌టెయిల్’కి ఇది రీమేక్. డైరెక్టర్ నాగశేఖర్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. అందుకే అవుట్‌‌పుట్‌‌ కూడా రిఫ్రెషింగ్‌‌గా వచ్చింది. ప్లెజంట్ ఎక్స్‌‌పీరియన్స్‌‌లా ఉంటుంది. రీమేక్స్‌‌లో నటించడం నాకు కొత్త కాదు. కానీ ఒరిజినల్‌ ఫిల్మ్‌ లో స్పెషాలిటీస్ మిస్‌‌ కాకుండా, చూసే ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా ఆ క్యారెక్టర్స్ చేయడం చాలెంజింగ్‌‌గా ఉంటుంది.  
  • ఇతర చిత్రాలతో పోలిస్తే లవ్‌‌ స్టోరీస్‌‌లో నటించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం కొంత కష్టమే. కానీ ఇందులోని కొత్త పాయింట్, ఎమోషన్స్, క్యారెక్టరైజేషన్స్ ఆకట్టుకుంటాయి. ‘గీతాంజలి’తో పోల్చడం సంతోషంగా ఉంది. ఒక క్లాసిక్‌‌తో మా సినిమాను పోల్చడం చూసి ఆ అంచనాలను రీచ్ అవుతామనే నమ్మకం కలిగింది. 
  • సత్యదేవ్‌‌తో కలిసి నటించడం హ్యాపీ. తను నటించిన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం చూశా. తన యాక్టింగ్‌‌ చాలా నేచురల్‌‌గా అనిపించి, తనతో కలిసి వర్క్ చేయాలనే ఆసక్తి కలిగింది. ఆ తర్వాత ఇందులో కలిసి నటించే అవకాశం దక్కింది. 
  • పెద్ద హీరో, చిన్న హీరో అనే తేడాలు నేను చూడను. ఎవరితో నటించినా సినిమాను సినిమాగానే చూస్తాను. అయితే ఆ సినిమా కథ బాగుండి..  ప్రేక్షకులకు నచ్చాలని కోరుకుంటాను. ఈ సినిమా విషయంలోనూ ‘నేను స్టార్ హీరోయిన్‌‌ని.. మిగతా వాళ్లంతా కొత్త వాళ్లు’ అని ఎప్పుడూ నుకోలేదు. నా క్యారెక్టర్ వరకు నేను న్యాయం చేయాలని చూస్తానంతే. డైరెక్టర్ ప్రతి సీన్‌‌ యాక్ట్‌‌ చేసి చూపించడంతో మా పని ఈజీ అయింది. 
  • నేను ఇండస్ట్రీకి వచ్చి పదిహేడేళ్లు అవుతోంది. ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాంటి ప్యాషన్ ఉందో  ఇప్పుడు అదే ప్యాషన్‌‌తో వర్క్ చేస్తున్నా. ప్రస్తుతం కంటెంట్‌‌ బేస్డ్‌‌ సినిమాలను ఎక్కువ ఆదరిస్తున్నారు. అందుకే నన్ను నేను ఓ స్టార్‌‌‌‌గా కాకుండా ఓ నటిగా చూసుకుంటున్నా. అప్పుడే ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించగలను. వీలయినంత వరకూ ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇంటరెస్టింగ్‌‌గా అనిపించే సినిమాలకు మాత్రమే ఓకే చెబుతున్నా. 
  • గాసిప్స్ ప్రకారం ఇప్పటికే నాకు ఓ డాక్టర్‌‌‌‌తో పెళ్లయింది. ఇటీవల ఓ బిజినెస్‌‌మేన్‌‌ను పెళ్లి చేసుకోబోతున్నాననే రూమర్ కూడా వచ్చింది. మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక బ్యూటిఫుల్ పార్ట్. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచనైతే లేదు. ఇక విమర్శలను పట్టించుకుంటాను కానీ ఆ విషయంలో పెద్దగా బాధపడను. అందుకే వాటి గురించి అంతగా రియాక్ట్ అవ్వను. పబ్లిక్‌‌ ఫిగర్‌‌‌‌ను కనుక నాపై ప్రజల్లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. ట్రోలింగ్ అనేది సోషల్ మీడియా కల్చర్‌‌‌‌లో ఒక పార్ట్. 
  •  చిరంజీవి గారితో కలిసి ‘భోళాశంకర్’లో నటిస్తున్నా.  ఫస్ట్ టైమ్ మలయాళంలో ‘బాంద్రా’ అనే సినిమాలో నటిస్తున్నా. అలాగే ఓటీటీలో మూడు  ప్రాజెక్ట్ లు చేస్తున్నా.