పద్మారావునగర్, వెలుగు: హైదరాబాద్ మహేంద్ర హిల్స్‌లోని ‘శ్రీ విద్యాస్ సెంటర్ ఫర్ స్పెషల్ చిల్డ్రన్’ విద్యార్థుల కోసం డీప్ (డీఈఈపీ) ట్రస్ట్ ‘హ్యాపీ వీల్స్’ పేరుతో ఒక ప్రత్యేక వాహనాన్ని అందజేసింది. ఆక్టేవ్ ఇండియా సంస్థ తన సీఎస్‌ఆర్ నిధులతో సమకూర్చిన ఈ 18 సీటర్ల టాటా వింగర్ వాహనాన్ని బుధవారం ప్రారంభించారు.
మేధోపరమైన వైకల్యంతో బాధపడుతున్న 150 మంది పిల్లలకు శ్రీ విద్యాస్ సెంటర్ ఉచిత సేవలు అందిస్తుండగా, రవాణా సౌకర్యం లేక పాఠశాలకు రాలేకపోతున్న పిల్లలకు ఈ వాహనం ఎంతో మేలు చేస్తుందని ఆక్టేవ్ ఇండియా సీఎఫ్ఓ బల్లవ్ ముంద్రా, డీఈఈపీ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ మధు వాసేపల్లి తెలిపారు. కార్యక్రమంలో స్కూల్ వ్యవస్థాపకురాలు శాంతి వెంకట్, స్వాతి మొహంతి పాల్గొన్నారు.
