V6 News

నాకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలుసు

నాకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు తెలుసు

రాజకీయాల ద్వారా పంజాబ్ కు సేవ చేస్తానన్నాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ‘ నాకు అన్ని పార్టీల రాజకీయ నాయకులు తెలుసు. నేను ఏ పార్టీలో చేరాలో ముందే ప్రకటిస్తాను. రాజకీయాల ద్వారా లేదా.. మరేదైనా పంజాబ్‌కు సేవ చేస్తాను. కానీ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’ అని అన్నాడు. వచ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నికలు జరుగుతుండటంతో భజ్జీని పార్టీలో చేర్చుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఆసక్తిగా  ఎదురుచూస్తున్నాయి.

హర్భజన్ సింగ్ ఇటీవల పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూను కలిశారు. దీంతో భజ్జీ కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు బీజేపీ భజ్జీని చేర్చుకోవాలని చూస్తోంది. అయితే హర్భజన్ సింగ్ ఏ పార్టీలో చేరతారనేది  ఆసక్తికరంగా ఉంది.  నిన్ననే అంతర్జాతీయ క్రికెట్ కు  గుడ్ బై చెప్పాడు భజ్జీ. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు.

ఇంటర్నేషనల్​ కెరీర్‌‌‌‌

ఫార్మాట్‌‌‌‌       మ్యాచ్​లు    వికెట్లు      బెస్ట్‌‌‌‌

టెస్టులు         103               417        15/217

వన్డేలు            236               227        5/31

టీ20లు            28                  27        4/12