పటీదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ కు అవమానం జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ గుజరాత్ సురేంద్ర నగర్ లోని బహిరంగ సభలో హార్దిక్ మాట్లాడుతుండగా… ఓ వ్యక్తి ఉన్నట్టుండి వేదికపైకి వచ్చి హార్దిక్ పటేల్ చెంప చెల్లుమనిపించాడు. కాంగ్రెస్ నేతలతో పాటు సభకు హాజరైన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే అతడిపై ప్రతిదాడి చేశారు.
దాడికి పాల్పడిన వ్యక్తిని కాంగ్రెస్ నేతలు చితకబాది… పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన వ్యక్తి ఎవరు… దాడి చేయడానికి గల కారణాలేంటనేది తెలియాల్సి ఉంది.
#WATCH Congress leader Hardik Patel slapped during a rally in Surendranagar,Gujarat pic.twitter.com/VqhJVJ7Xc4
— ANI (@ANI) April 19, 2019
