రుణమాఫీపై సీఎం రేవంత్కు హరీశ్ కౌంటర్

రుణమాఫీపై సీఎం రేవంత్కు హరీశ్ కౌంటర్

రేవంత్ రెడ్డి  సీఎం  స్థాయికి తగ్గట్టు ప్రవర్తించలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ దేవుళ్లపై ఒట్టు పెట్టుకుని మాట మీద నిలబడకపోగా తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియా గాంధీ పుట్టిన రోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి 40వేల కోట్ల రూపాయల రైతు రుణ మాఫీ ఏకకాలంలో చేస్తానని రేవంత్ రెడ్డి అన్నారు. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరలేపారని విమర్శించారు. 

 తాము మొదటి దఫాలోనే లక్ష రూపాయల రుణమాఫీ 35 లక్షల మంది రైతులకు చేస్తేనే దాదాపు 17వేల కోట్లు అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటరా? 17,869 కోట్లు మాత్రమే అవుతాయా? . ఈ ఒక్కవిషయంతోనే  కాంగ్రెస్  రుణమాఫీ పచ్చి అబద్దం అని తేలిపోయిందన్నారు హరీశ్.