బీజేపీతో కుమ్మక్కై ఏపీ ప్రభుత్వం తెలంగాణపై కుట్రలు పన్నుతోందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఆరోపించారు. గోదావరి రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (GRMB) అజెండాపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
గోదావరి రివర్ బోర్డు అజెండా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకోసమే పనిచేస్తున్నట్లుగా ఉందని, ఇది తెలంగాణకు తాగు, సాగునీరు దక్కకుండా చేసేలా ఉందని మండిపడ్డారు.
తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉన్న ఈ అజెండాపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని, మౌనం ఎందుకు వహిస్తున్నారని నిలదీశారు.ఆగస్టు 18న జరగనున్న గోదావరి రివర్ బోర్డు సమావేశంలో, సమ్మక్క సాగర్‌కు అనుమతులు ఇవ్వొద్దని ఏపీ వాదిస్తోందని... సమ్మక్క సాగర్‌కు అనుమతిస్తే పోలవరానికి నీళ్లు తగ్గుతాయనేది వారి అజెండా అని తెలిపారు.
గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సమర్థవంతంగా ఎత్తిపోయడంలో విఫలమైందని ఆరోపించారు.
