సిద్దిపేట టౌన్, వెలుగు: నందిని సిధారెడ్డి సాహిత్య రంగంలో తరగతి గని అని, ఆయన తన జీవితంలో ఆస్తుల వైపు కాకుండా అస్తిత్వమే ఆస్తిగా భావించి బతుకుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిధారెడ్డి జాతీయ సాహిత్య పురస్కారం వచ్చిన సందర్భంగా శనివారం రాత్రి సిద్దిపేట పట్టణంలో విపంచి కళానిలయంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిధారెడ్డి పదవులు డబ్బులు కంటే సామాజిక సమస్యలపై ముక్కుసూటిగా పనిచేస్తారని, వెనకటి రోజుల్లోనే ఫేక్ ఎన్‌కౌంటర్లు, అంటరానితనం, రైతు ఆత్మహత్యలు, మద్యపాన నిషేధం వంటి వాటిపై మంజీరా రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యక్షంగా, పుస్తకాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపారన్నారు. అనంతరం మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆయన వీక్షించి విజేతలకు బహుమతులను అందజేశారు.

