V6 News

డుమ్మా కొడితే చర్యలు తప్పవు: డాక్టర్లకు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వార్నింగ్

డుమ్మా కొడితే చర్యలు తప్పవు: డాక్టర్లకు మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వార్నింగ్

హైదరాబాద్, వెలుగు : ప్రభుత్వ డాక్టర్లు డ్యూటీలకు డుమ్మా కొడితే చర్యలు తప్పవని హెల్త్  మినిస్టర్ హరీశ్  రావు హెచ్చరించారు. డాక్టర్లు దవాఖాన్లలో 24 గంటలు అందుబాటులో ఉండాలని, పేషెం ట్ ఎప్పుడొచ్చినా వెంటనే అడ్మిట్ చేసుకుని ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెంట్ అందేలా చూడాలని సూపరింటెండెంట్లను ఆదేశించారు. డాక్టర్లు లేరనో, మరో కారణంతోనో  రోగులను హైదరాబాద్ వరకూ రిఫర్ చేయకూడదన్నారు. నిబంధనల ప్రకారం ఏయే ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అందించాలో, అవన్నీ జిల్లాల్లోని హాస్పిటళ్లలోనే అందించాలన్నారు. 

మెడికల్ కాలేజీలు, వాటి అనుబం ధ హాస్పిటళ్ల పనితీరుపై మంత్రి బుధవారం వీడి యో కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  ద్వారా సమీక్ష నిర్వహించారు. ఇటీ వల నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డెలివరీ కోసం వచ్చిన మహిళ చనిపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంబీబీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డాక్టర్లు పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో కూడా సేఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా డెలివరీలు చేస్తున్నారని, నాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కర్నూల్ దవాఖానలో స్పెషలిస్ట్ డాక్టర్లు, సీనియర్లు ఉండి ఏం చేస్తున్నారని సూపరింటెండెంట్ సుప్రియను నిలదీశారు. ఇలాంటి ఘటనలు జరగకుం డా చర్యలు తీసు కోవాలని ఆదేశించారు.