ఖమ్మం టౌన్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ రిజల్ట్స్ లో ఖమ్మం సిటీలోని హార్వెస్ట్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ అగ్రశ్రేణిగా నిలిచినట్లు ఆ కాలేజ్ మేనేజ్మెంట్ తెలిపింది. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బి.నీరజ్(467), షేక్ లాల్ బీ(467), బి.సాత్విక ప్రియ(466), ఎం.సాయి దుర్గా(466), షేక్ మనా తన్వీర్(465), ఎ.అక్షయ్(465), టి.బి.నరసింహ (465), బి.కార్తికారెడ్డి(464), రిషి లక్ష్మణ్(464), ఎం.రేవంత్ కుమార్(464), ఎ.కుమార్ నాయక్(464), టి.హారిక(464), కె.తనుష్క (464) మార్కులు సాధించగా, మ్యాథ్స్(ఎ1)లో 36 మంది, (1బి)లో 55 మంది ఫిజిక్స్‌లో 112, కెమిస్ట్రీలో 75 మంది స్టూడెంట్స్ వంద శాతం మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ నుంచి కె.రుచిత(993) కాలేజ్ ను టాపర్‌గా నిలిపినట్లు తెలిపారు.
ఎ.యామిని(992), ఎ.శ్రీకళ(991), జి.కౌసల్య(989), వి.కీర్తి రెడ్డి(988), జి.ప్రణతి (987), జి.శ్రావణ్ కుమార్(986), ఎన్.సిరి శాన్వి(985), షేక్ మహబూబ్ పాషా (985), వై.యస్వంత్(984), పి.సంజయ్ రామస్వామి(984), జి.సమిత్(982), జి.యస్మిత(982), పి.జె.రాఘవ చౌదరి(982) ఉత్తమ మార్కులు సాధించారని యాజమాన్యం పేర్కొన్నది.
మ్యాథ్స్(2ఎ) లో 33 మంది, మ్యాథ్స్(2బి)లో 34 మంది, ఫిజిక్స్‌లో 39 మంది, కెమిస్ట్రీలో 33 మంది వందకి వంద శాతం మార్కులు సాధించినట్లు తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ నుంచి 27 మంది స్టూడెంట్స్ 460 మార్కులకు పైగా, సెకండ్ ఇయర్ 69 మంది స్టూడెంట్స్ 900 మార్కులకు పైగా మార్కులు సాధించడంపై హార్వెస్ట్ మేనేజ్మెంట్ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా హార్వెస్ట్ గ్రూప్ ఆఫ్ విద్యాసంస్థల కరస్పాండెంట్ పి.రవి మారుత్, ప్రిన్సిపల్ ఆర్.పార్వతీ రెడ్డి స్టూడెంట్స్ ను అభినందించారు.
