V6 News

నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. సెలవులో ఉన్నందుకేనట

నుహ్ ఎస్పీ వరుణ్ సింగ్లాపై బదిలీ వేటు.. సెలవులో ఉన్నందుకేనట

హర్యానా ఇటీవల చోటుచేసుకున్న మత ఘర్షణల సమయంలో సెలవులో ఉన్న నుహ్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) వరుణ్ సింగ్లాను బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు. అతన్ని భివానీ ఎస్పీగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. వరుణ్ సింగ్లా స్థానంలో ఐపీఎస్ అధికారి నరేంద్ర బిజర్నియాను నుహ్ కొత్త ఎస్పీగా నియమిస్తామని అడిషినల్ చీఫ్ సెక్రటరీ (హోమ్) TVSN ప్రసాద్ ఆగస్టు 3న తెలిపారు. వీహెచ్ పీ ర్యాలీలో ఘర్షణలు జరిగిన రోజు వరుణ్ సింగ్లా సెలవులో ఉన్నారు.

ప్రస్తుతం ఎస్పీని నుహ్‌ నుంచి బదిలీ చేసి భివానీ ఎస్పీగా నియమించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక బిజర్నియా విషయానికొస్తే ఆయన భివానీ ఎస్పీతో పాటు అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు, నుహ్ పరిసర ప్రాంతాలలో శాంతిభద్రతల పరిస్థితిని నిర్వహించడంలో బిజర్నియాను ఎస్పీగా నియమిస్తూ.. ప్రస్తుత విధులకు అదనంగా చేర్చారు.

విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో నుహ్‌లో చెలరేగిన ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఒక మతగురువు సహా ఆరుగురు మరణించారు. ఈ ఘటన పక్కనున్న గురుగ్రామ్, సోహ్నా, ఇతర ప్రాంతాల్లో మతపరమైన చిచ్చుకు కారణమైంది. ఈ క్రమంలో ఆందోళనకారులు వివిధ దుకాణాలు, సంస్థలపై దాడి చేసి, దహనం చేశారు. దీంతో అక్కడ పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు.