జమ్మూకాశ్మీర్ లో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలింది. సాంబా జిల్లాలోని జఖా దగ్గర ఢిల్లీనుంచి కాశ్మీర్ లోని కత్రా వరకు నేషనల్ హైవే అథారిటీ నిర్మిస్తున్న ఎక్స్ ప్రెస్ హైవే లోని ఓ భాగం కుప్పకూలింది. సెగ్మెంట్ లాంచింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోగా మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకా కొందరు శిథిలాల కింద ఉన్నట్లు తెలుస్తోంది. చికిత్స కోసం వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. మృతుడు, గాయపడ్డవారికి రూ. 5లక్షల ఎక్స్ గ్రేషయా ప్రకటించింది నేషనల్ హైవే అథారిటీ.
ఢిల్లీ నుంచి జమ్మూకాశ్మీర్ కు ఢిల్లీ, అమృత్ సర్, కత్రా మీదుగా ఈ ఎక్స్ ప్రెస్ హైవేను NHAI నిర్మిస్తోంది. ఈ హైవే ఫ్లోఓవర్ లో మొత్తం 15 స్పాన్లు ఉండగా.. ఇప్పటికే 10 స్పాన్లు పూర్తయ్యాయి. మరో నాలుగు మిగిలి ఉన్నాయి. మంగళవారం (ఆగస్టు 25) ఓ సెగ్మెంట్ లాంచింగ్ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సెగ్మెంట్ లాంచింగ్ చేస్తున్న పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది దీంతో బ్రిడ్జి శిథిలాల కింద చిక్కుకుని బీహార్ కు చెందిన కార్మికుడు మృతిచెందాడు. మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. చికిత్సకోసం వారిని ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు.
ALSO READ : సీఎం నివాసం ముట్టడికి విద్యార్థుల యత్నం..
ఈ ప్రమాదంలో నేషనల్ హైవేఅథారిటీ (NHAI) ప్రాజెక్టు డైరెక్టర్ రాజీవ్ కుమార్ స్పందించారు. ఢిల్లీ–అమృత్‌సర్–కత్రా ప్రాజెక్టులోని ప్యాకేజ్-15లో భాగంగా ఎలివేటెడ్ సెక్షన్‌ను నిర్మిస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
