జీడిమెట్ల, వెలుగు: హాష్ ఆయిల్విక్రయిస్తున్న ఒకరిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్‌పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ఈస్ట్‌గోదావరి జిల్లాలోని జగనాథపురానికి చెందిన జైసత్యసాయి అపురూపకాలనీలో హాష్‌ఆయిల్ విక్రయిస్తున్నాడనే సమాచారంతో బుధవారం ఎక్సైజ్‌పోలీసులు దాడులు చేశారు.
జై సత్యసాయి నుంచి రూ.11 లక్షల విలువ చేసే 500 గ్రాముల హాష్ఆయిల్తో పాటు స్విఫ్ట్ కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
