జలంధర్: తనకు చాలా పొలిటికల్ పార్టీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయని అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. అయితే, పాలిటిక్స్‌లోకి రావాలన్న ఆలోచన ప్రస్తుతానికైతే లేదన్నాడు. ‘నా ఫ్యూచర్ ప్లాన్ గురించి ఇంకా డిసైడ్ అవ్వలేదు. నేను క్రికెట్‌తో కనెక్ట్ అయి ఉంటా. ఎందుకంటే క్రికెట్ వల్లే జనాలకు నేను తెలుసు. నా పొలిటికల్ కెరీర్ గురించి నేనే వెల్లడిస్తా. ఏం జరిగినా అందరికీ తెలియజేస్తా. నిజాయితీగా చెప్పాలంటే నాకు పాలిటిక్స్‌లో జాయిన్ అవ్వాలన్న ఆలోచన లేదు. కానీ, నన్ను జాయిన్ చేసుకుంటామని చాలా పార్టీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.ఈ విషయంపై బాగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇదేమీ చిన్న నిర్ణయం కాబోదు. చాలా డిమాండ్ ఉన్న ప్రొఫెషన్ కాబట్టి అర్ధ మనస్సుతో నేను పని చేయలేను. ఈ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని అనుకున్న రోజే దాని కోసం ముందుకెళ్తా’ అని భజ్జీ స్పష్టం చేశాడు.

