
కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో భారతదేశంలో అగ్రశ్రేణి ఎఫ్‌ఎంసీజీ కంపెనీలలో ఒకటైన హిందుస్తాన్ కోకా–కోలా బేవరేజస్ HCCB విజయవంతంగా రెండు అదనపు పునరుత్పాదక విద్యుత్ ప్రారంభించింది. ఈ ప్రాజెక్టులను విజయవాడ, అమీన్ పూర్ (హైదరాబాద్ సమీపంలో) తమ ఫ్యాక్టరీల వద్ద ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే శుక్రవారం అమీన్ పూర్ ఫ్యాక్టరీ వద్ద సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ను ప్రారంభించినట్లు తెలిపిన సంస్థ.. విజయవాడలోని ఫ్యాక్టరీ కోసం సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు చెప్పింది. కరోనా మహమ్మారి సమయంలో ఏడు అదనపు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్ట్ లను ప్రారంభించామంది.
అమీన్ పూర్ ఫ్యాక్టరీలోని సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్ ప్రాజెక్ట్‌ను 800కిలోవాట్ పవర్ సామర్ధ్యంతో ఏర్పాటు చేశారు. విజయవాడ ఫ్యాక్టరీ కోసం, హెచ్‌సీసీబీ ఇప్పుడు స్లిలాండ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కొనుగోలు ఒప్పందం చేసుకుంది. 6 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్‌ను సరఫరా చేయనుంది. పునరుత్పాదక విద్యుత్ వనరులను వినియోగించేందుకు అవకాశాలను గురించి మా బృందం నిరంతరం అన్వేషిస్తూనే ఉంటుందని తెలిపారు హెచ్ సీసీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అలోక్ శర్మ.