HCUలో యువతి అనుమానాస్పద మృతి

HCUలో యువతి అనుమానాస్పద మృతి

హైదరాబాద్ : సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. హిందీ సబ్జెక్టు మీద PHD చేస్తున్న దీపికా మహాపాత్ర..సోమవారం తెల్లవారుజామున బాత్రూంలో పడి చనిపోయింది. కొన్ని రోజుల నుంచి న్యూరో ప్రోబ్లంతో అవస్థలు పడుతున్నట్లు తెలిపారు ఆమె ఫ్రెండ్స్. సమాచారం అందుకున్న పోలీసేలు..మృత దేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా హస్పిటల్ కి తరలించారు. దీపిక చనిపోయిన విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పిన పోలీసులు .. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.