అంకిత భావం, కృషి, పట్టుదల ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నా విజయం సాధించొచ్చని, ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, గౌరవ మర్యాదలు పొంద వచ్చని నిరూపించింది ఓ ఆటో డ్రైవర్ కూతురు. తండ్రి పేదరికంలో ఉన్నా కాన్ఫిడెంట్ గా చదివి ఫిజియోథెరపీ కోర్సులో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది.భవిష్యత్తులో ఆమె న్యూరోసైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించి, ఆరోగ్య సంరక్షణ రంగంలో తన వృత్తిని కొనసాగించాలని గోల్ గా పెట్టుకుంది.
బెంగళూరుకు చెందిన స్పందన స్థానిక పద్మశ్రీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీలో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి అందరినీ ఆశ్చర్యపర్చారు. చదువులో రాణించాలని తపన పడే స్పందన తన ప్రతిభకు పేదరికం అడ్డుకాదని నిరూపించింది. ఎంబీబీఎస్ చదవాలనుకున్న స్పందన.. కోవిడ్ కారణంగా ఫిజియోథెరపి కోర్సును ఎంచుకుంది. ప్రత్యామ్నాయంగా ఎంచుకున్న కోర్సు ఇపుడు ఆమెను ఉన్నత స్థాయిలో నిలిపింది. పట్టుదల , కృషి ఆమెకు బంగారు పతకాలు సాధించి పెట్టాయి. అందరి ప్రశంసలు పొందే లా చేశాయి.
సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన స్పందన, తన కుటుంబ మద్దతే తనకున్న గొప్ప బలం అని తెలిపింది. తన విజయానికి చాలా వరకు తన కళాశాల నుంచి లభించిన మద్దతు, గైడెన్స్ కారణమని ఆమె తెలిపింది. కృషి ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించొచ్చు.. ఉన్నత స్థాయిని పొందచ్చని స్పందన నిరూపించింది.
