ఖమ్మం జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం

ఖమ్మం జిల్లాలో భూకంపం.. అర్ధరాత్రి ఇళ్లలో నుంచి పరుగులు తీసిన జనం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భూకంపం సంభవించింది. జనాలు గాఢ నిద్రలో ఉండగా అర్థరాత్రి భూమి కంపించింది. దీంతో జనాలు నిద్ర లేచి ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. ఆదివారం ( జూన్ 14) తెల్లవారు జామున 2.26 గంటలకు భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాంతోళనలకు గురయ్యారు. 

ముఖ్యంగా భద్రాద్రి జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.  అర్థరాత్రి 2.26 గంటల సమయంలో వచ్చిన భూకంపంతో జనాలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి. 

భద్రాద్రి జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత తక్కువ స్థాయిలో ఉన్నందున ప్రజలు భయాందోళనలకు గురికావద్దని అధికారులు సూచించారు.