మెగా ఫ్యామిలీ సినిమా..వెనక్కి తగ్గిన వర్మ

మెగా ఫ్యామిలీ సినిమా..వెనక్కి తగ్గిన వర్మ

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ  తాను అన్న మాటకు కట్టుబడి  ఉండడని తానే చెబుతాడు. నిత్యం ట్విట్టర్లో ఏదో ట్వీట్ చేస్తూ సంచలనం రేపుతుంటాడు వర్మ. కమ్మరాజ్యంలో కడపరెడ్లు ట్రైలర్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన వర్మ నిన్న ట్విట్టర్లో మరో బాంబ్ పేల్చారు. తాను నెక్స్ట్ తీయబోయే సినిమా మెగా ఫ్యామిలీ అని..మిగతా వివరాలు 29 న ప్రకటిస్తానని ట్వీట్ చేశారు వర్మ.

అయితే మళ్లీ ఏమైందో ఏమో వర్మ తాను మెగా ఫ్యామిలీ సినిమా తీయడం లేదని  మరో ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీ అంటే 39 మంది పిల్లలతో సినిమా అని.. తాను పిల్లలతో సినిమా సరిగా తీయలేనని.. అందుకే మెగా ఫ్యామిలీ సినిమా తీయడం లేదని ట్వీట్ చేశారు వర్మ.