960కి.మీ బైక్ పై వెళ్లి మందులు అంద‌జేశాడు

960కి.మీ బైక్ పై వెళ్లి మందులు అంద‌జేశాడు

ఓ కానిస్టేబుల్ చేసిన మంచి ప‌నికి సోష‌ల్ మీడియాలో ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి. 100 కాదు..200 కాదు ఏకంగా 960 కిలీమీట‌ర్లు బైక్ పై వెళ్లి మెడిసిన్స్ అంద‌జేశాడు. ఈ సంఘ‌ట‌న బెంగ‌ళూరులో జ‌రుగ‌గా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అయ్యాయి.

వివ‌రాలు

ల‌క్ డౌన్ కార‌ణంగా క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఓ వ్య‌క్తి మందులు తెచ్చుకోలేక పోతున్నాన‌ని ఓ టీవీ ఛాన‌ల్ ద్వారా త‌న బాధ‌ను వెలిబుచ్చాడు. అయితే బెంగ‌ళూరు న‌గ‌ర క‌మిష‌న్ ఆఫీసులో ప‌నిచేసే హెడ్ కానిస్టేబుల్ కుమార‌స్వామి టీవీలో వ‌చ్చిన ఈ ప్రోగ్రాం చూసి చ‌లించిపోయాడు. ఉన్న‌తాధికారుల అనుమ‌తితో బైక్ పై వెళ్లి 960 కి.మీ దూరంలో ఉన్న ఆ వ్య‌క్తికి మందులు అంద‌జేశాడు. ఆయ‌న మాన‌వ‌త్వాన్ని పోలీస్ ఉన్న‌తాధికారుల‌తో పాటు ప్ర‌జ‌లు మెచ్చుకుంటున్నారు.