V6 News

శాంపిల్స్ ఎందుకు సేకరించట్లేదు..?..వికారాబాద్ లోని డయాగ్నస్టిక్ హబ్ పై హెల్త్ కమిషనర్ ఆగ్రహం

శాంపిల్స్ ఎందుకు సేకరించట్లేదు..?..వికారాబాద్ లోని డయాగ్నస్టిక్ హబ్ పై హెల్త్ కమిషనర్ ఆగ్రహం

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంసీహెచ్, తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్​ను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ గురువారం ఆకస్మికంగా సందర్శించి వైద్య సేవల తీరును పరిశీలించారు. డయాగ్నస్టిక్ హబ్​లో పరీక్షల వివరాలను తనిఖీ చేసిన ఆమె.. పూడూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి గత కొన్ని నెలలుగా శాంపిల్స్ సేకరించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీనిపై వివరణ తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. టీబీ రోగుల వివరాలను ఎప్పటికప్పుడు ‘నిశ్చయ్’ పోర్టల్‌లో నమోదు చేయాలని, గర్భిణిలు, నవజాత శిశువులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీలో కమిషనర్​తో పాటు టీబీ సంయుక్త సంచాలకులు డాక్టర్ రాజేశం, టీ హబ్ రాష్ట్ర సమన్వయ అధికారి డాక్టర్ నందిత ఉన్నారు.