కరోనా నుంచి కోలుకున్నవారికి ఈటెల రాజేందర్ అభ్యర్థన

కరోనా నుంచి కోలుకున్నవారికి ఈటెల రాజేందర్ అభ్యర్థన

కరోనా బారినపడి కోలుకున్న వారికి తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓ అభ్యర్థన చేశారు. కరోనా పేషంట్లు ప్లాస్మా థెరపీతో తొందరగా కోలుకుంటుండటంతో.. కరోనా నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని ఆయన కోరారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత రాష్ట్రంలో రోజుకు 1500 పైగా కేసులు నమోదవుతున్నాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ప్రతిరోజూ 1000కి పైగా కేసులు నమోదవుతుండటంతో.. నగర ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒకానొక సమయంలో హైదరాబాద్ లో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వార్తలు కూడా వచ్చాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బుధవారం రాత్రి వరకు రాష్ట్రంలో 29,536 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 17,279 మంది డిశ్చార్జ్ కాగా.. 11,933 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 324 మంది చనిపోయారు.

For More News..

కొత్త విద్యా సంవత్సరం ప్రకటించిన ఏఐసీటీఈ

ప్రధానిని టార్గెట్ చేయాలంటే ఎంతసేపు?