హైదరాబాద్, వెలుగు : కంటెయిన్మెంట్ జోన్లలో కరోనా కట్టడికి హెల్త్ వర్కర్లు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి హెల్త్ ప్రాబ్లమ్స్ అడిగి తెలుసుకుంటున్నారు. రెగ్యులర్ చెకప్‌లతో పాటు ఎమర్జెన్సీ సేవల్లోనూ తోడుంటున్నారు. పని ఒత్తిడితో కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నా, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న అనుభవాలు బాధపెడుతున్నాయని హెల్త్‌వర్కర్లు ఆవేదన చెందుతున్నారు.
2 వేల మందికి పైగా..
హైదరాబాద్‌లో 96 కంటెయిన్మెంట్ జోన్లు ఉండగా, దాదాపు 1200 మంది ఆశ వర్కర్లు, వెయ్యి మంది ఏఎన్ఎంలు డ్యూటీ చేస్తున్నారు. వారంతా స్థానికంగా ఉండే పీఎస్ యూ, పీహెచ్ సీల పరిధిలోని కంటెయిన్మెంట్ జోన్లలో డైలీ డోర్‌టు డోర్ వెళ్లి హెల్త్ చెకప్‌లు చేస్తున్నారు. గర్భణులు, ఇతర పేషెంట్లకు వైద్యం అందించడంతోపాటు అక్కడి పరిస్థితులపై ఎప్పటికప్పుడు వైద్యాధికారులకు రిపోర్ట్ ఇస్తున్నారు. క్లిష్టపరిస్థితుల్లో డ్యూటీ చేస్తున్నా.. కొన్నిసార్లు ప్రజల చీత్కారాలు, చీదరింపులు ఎదురవుతున్నాయని మల్లేపల్లి బడా మసీద్ కంటయిన్మెంట్ జోన్ లో డ్యూటీ చేస్తున్న ఆశ వర్కర్ తెలిపారు. ఎన్నిసార్లు వచ్చి వివరాలు అడుగుతారని కొందరు సీరియస్ అయితున్నట్లు చెప్పారు.
ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక ప్రాబ్లమ్స్
లాక్‌డౌన్‌తో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేక హెల్త్‌వర్కర్లు ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9.30లోపే డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా, ఓన్ వెహికల్లేనివారు టైమ్‌కు వెళ్లలేకపోయిన రోజు అధికారుల నుంచి తిట్లు తింటున్నారు. నోడల్ అధికారికి మొరపెట్టుకున్నా, వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవారికి యూనిఫైడ్ ట్రాన్స్ పోర్ట్ఫెసిలిటీ కల్పించడం కష్టమంటున్నారని పలువురు వాపోతున్నారు. రోడ్డుపై లిఫ్ట్ అడిగితే ఎవరూ ఇవ్వడం లేదని, వెయిట్ చేసి పరిమితంగా కేటాయించిన బస్సుల్లోనే వస్తున్నామని మరికొందరు చెప్తున్నారు.
లిఫ్ట్ కూడా ఇస్తలేరు
టైమ్‌కు డ్యూటీకి వెళ్లాలంటే ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ లేదు. ఓన్ వెహికల్‌పై వెళ్తూ పాస్ లు చూపించినా పోలీసులు అడ్డుకుంటున్నరు. లిఫ్ట్ అడిగినా కరోనా భయంతో ఎవరూ బండి ఆపడం లేదు. కొన్ని ఏరియాల్లో ట్రాన్స్‌పోర్టేషన్ కల్పించినా, పూర్తిస్థాయిలో లేదు.
– అపర్ణ, ఆశ వర్కర్, మలక్ పేట గంజ్
మళ్లీమళ్లీ రావద్దంటున్నరు
కంటెయిన్మెంట్ జోన్ ఎత్తేసే వరకు డైలీ హెల్త్డీటెయిల్స్ కలెక్ట్ చేయాలనే నిబంధనలున్నా యి. కరోనాపై అవేర్నెస్ కల్పించేందుకు ఇండ్ల కు వెళ్తున్నా చాలామంది సహకరించడం లేదు. ఎన్నిసార్లు వస్తరంటూ కొందరు కోపానికొస్తున్రు.
– దుర్గాప్రసన్న, ఏఎన్ఎం, బజార్‌ఘాట్