సరైన తిండి తినక పిల్లల్లో చదివే సామర్థ్యం తగ్గుతోంది

సరైన తిండి తినక పిల్లల్లో చదివే సామర్థ్యం తగ్గుతోంది

దేశంలో 2000వ సంవత్సరం నుంచి స్కూళ్లలో చేరుతున్న పిల్లల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నంబరైతే పెరుగుతోంది కానీ వాళ్లకు చదివే సామర్థ్యం మాత్రం తగ్గుతోంది. కారణం సరైన స్థాయిలో తిండి దొరక్కపోవడం. దొరికినా పోషకాలుండక పోవడం. దీనివల్ల పిల్లల చదువుతో పాటు వారి ఆరోగ్యంపై, పరోక్షంగా దేశ ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతోంది. పైగా ప్రపంచవ్యాప్తంగా పోషకాహార లోపంలోనూ ఇండియా టాప్‌ లోనే ఉంది. ఇదీ మరోరకంగా పిల్లల చదువును దెబ్బతీస్తోంది. తిండి, చదువుపై బిర్లా ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ అసి స్టెంట్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌ సుకుమార్‌‌‌‌‌‌‌‌ వెల్లక్కల్‌‌‌‌‌‌‌‌, లండన్‌‌‌‌‌‌‌‌లోని ఇంపీరియల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ లెక్చరర్‌‌‌‌‌‌‌‌ ఎలిసాబెట్ట, లాంకెస్టర్‌‌‌‌ యూనివర్సిటీ లెక్చరర్‌‌‌‌‌‌‌‌ జాస్మిన్‌‌‌‌‌‌‌‌ చేసిన సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి.

  • సరైన ఆహారం తినక తగ్గుతున్న సామర్థ్యం
  • దేశ ఆర్థిక వ్యవస్థపైనా పరోక్ష ప్రభావం
  • చిన్నారుల చదువుపై తిండి ప్రభావం

 

అసలు చదువుకు, తిండికి లింకేంటి? అంటేపెద్ద సంబంధమే ఉంది. ఇంట్లో తినడానికి ఆహారం లేకపోతే తల్లిదండ్రులు ఇతరత్రా ఖర్చులు తగ్గిస్తారు. పిల్లల స్కూలు ఫీజు, పుస్తకాలు, బట్టలులాంటి వన్నమాట. ఫీజు కట్టకపోతే పిల్లలు స్కూలుకెళ్లరు. పైగా పూట గడవాలి కాబట్టి చిన్నచిన్న పనుల్లో చేరతారు. స్కూల్‌‌‌‌‌‌‌‌ డ్రాపౌట్స్‌‌‌‌‌‌‌‌ పెరుగుతాయి. సరైనతిండి లేకపోతే ఆరోగ్యమూ అంతంత మాత్రమే. బక్కగైపోతారు. తినేదీ పోషకాలు లేని తిండే. దీంతో మెదడుపై ప్రభావం పడుతుంది. యంగ్‌‌‌‌‌‌‌‌ లైవ్స్‌‌‌‌‌‌‌‌ నివేదిక ప్రకారం దేశంలో 12 ఏళ్లలోపు పిల్లల్లో 47 శాతంమందికి సరైన ఆహారం దొరకడం లేదు. అయితే పేదపిల్లలపైనే తిండి , చదువు ప్రభావం ఎక్కువుంటుందంటే తప్పే. 18 శాతం సంపన్న కుటుంబాల్లోనూ ఇలాంటి సమస్యే ఉంది.

మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌పై ఎక్కువ ప్రభావం
2002 నుం చి 12 ఏళ్లలోపు పిల్లలపై యంగ్‌‌‌‌‌‌‌‌ లైవ్స్‌‌‌‌‌‌‌‌ సర్వే చేస్తూ వస్తోంది. ఈ వివరాలను పరిశోధకులు వాడుకున్నారు. పిల్లలు 5 నుంచి 8 ఏళ్ల మధ్యలో ఉన్నప్పుడు, 12 ఏళ్లున్నప్పుడు వాళ్ల కుటుంబాల్లో తిండిదొరక్కపోవడం లాంటి సమస్య, చదువుపై దాని ప్రభావాన్ని అంచనా వేశారు. ముఖ్యంగా ఇంగ్లిష్‌ ,మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌, స్థానిక భాషలపై ప్రభావాన్ని పరిశీలించారు.చిన్నతనంలో సరైన తిండి దొరక్కపోతే వకాబులరీ, చదవడంపై తీవ్ర ప్రభావం పడుతుందని పరిశోధనలో వెల్లడైంది. తిండి ప్రభావం ఇంగ్లిష్‌ పై ఎక్కువగా ఉండదని, అయితే తర్వాతైనా ఆ భాషను నేర్చుకోగలరని తెలిసింది. కానీ మ్యాథ్స్‌‌‌‌‌‌‌‌పై తిండి ప్రభావం ఎక్కువుంటుందని వెల్లడైంది. కూడికలు, తీసివేతలు లాంటి బేసిక్స్‌‌‌‌‌‌‌‌ నేర్చుకోకపోతే తర్వాత పిల్లలు చాలాఇబ్బంది పడుతున్నారని తేలింది.

పెట్టుకున్న లక్ష్యాలూ..
ఆహార భద్రతపై ఇండియా దృష్టి సారిస్తే చిన్నతనంలో పిల్లల్లో లెర్నింగ్‌‌‌‌‌‌‌‌ సమస్యను అధిగమించొచ్చని సర్వేచెప్పింది. ఇందుకు సంబంధించి పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడితే మంచి ఫలితాలొస్తాయంది. దీనిప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా ఉంటుందని, పిల్లలు పెద్దవాళ్లై మంచి ఉద్యోగాల్లో చేరితే జీడీపీ పెరుగుతుందని వివరించింది. పైగా దీని ద్వారా ఐక్యరాజ్యసమితి 17సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మూడింటిని సాధించవచ్చంది. రెండో లక్ష్యమైన ఆహార భద్రతను పెంచి ఆకలిని తరిమికొడితే పనిలోపనిగా పదో లక్ష్యమైన అసమానతలను తగ్గించినట్టేనని వివరించింది. 14వ లక్ష్యమైన నాణ్యమైన విద్యనూ చేరుకోవచ్చని చెప్పింది.