V6 News

‘భద్రాద్రికొత్తగూడెం’పై భానుడి ప్రతాపం.. 

‘భద్రాద్రికొత్తగూడెం’పై భానుడి ప్రతాపం.. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. శుక్రవారం జిల్లాలో పలు మండలాల్లో 43 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చుంచుపల్లి మండలం గరిమెల్లపాడు వద్ద అత్యధికంగా 43.7 డిగ్రీలు నమోదు కాగా, కరకగూడెం, అశ్వాపురం ప్రాంతాల్లో 43.6, 43.5 నమోదయ్యాయి. పాల్వంచ, చర్ల, మణుగూరు ప్రాంతాల్లో కూడా 43 డిగ్రీలు, భద్రాచలం, టేకులపల్లి, దుమ్ముగూడెం, ఇల్లందు, సుజాతనగర్ ప్రాంతాల్లో కూడా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రత మరికొన్ని రోజులు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  - చుంచుపల్లి, వెలుగు