సుల్తానాబాద్, వెలుగు: ఎండ తీవ్రతకు లారీలో మంటలు చెలరేగి కాలిపోయింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక చెరువు నుంచి ఓ లారీ మట్టి లోడ్‌తో కోమండ్లపల్లిలోని ఇటుక బట్టీకి బయలుదేరింది. శాస్త్రినగర్ ఎస్సారెస్పీ కెనాల్ సమీపంలోకి రాగానే ఎండ వేడితో ఇంజిన్‌లో షార్ట్ సర్య్యూట్‌లో మంటలు చెలరేగాయి. వెంటనే క్యాబిన్ లోకి మంటలు వ్యాపించడంతో అప్రమత్తమైన లారీ డ్రైవర్ బోగిరి శ్రీనివాస్ లారీని రోడ్డుపక్కన ఆపాడు.
కిందికి దిగి సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌ను తీసుకువచ్చి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందడంతో వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పారు. అప్పటికే ఇంజిన్, క్యాబిన్ పూర్తిగా కాలిపోయింది. ఎస్సై చంద్ర కుమార్ ఘటనాస్థలిని పరిశీలించారు.
