ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం పండిట్‌ దీన్‌దయాళ్‌ భవన్‌లోని ఐదో అంతస్తులో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ మంటలు అంతటా వ్యాపించాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది 24 ఫైరింజ‌న్లతో ఘటన స్థలానికి చేరుకున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఓ సెక్యూరిటీ గార్డుకు గాయలైనట్టుగా సమాచారం. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

ఈ క్లాంపెక్స్‌లో ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ బ్రాంచ్‌తోపాటు, అటవీ మంత్రిత్వ శాఖ, ఎన్డీఆర్‌ఎఫ్‌ కార్యాలయాలు  ఉన్నాయి. గతంలో ఈ బిల్డింగ్‌ను పర్యావరణ భవన్‌గా పిలిచేవారు.