
హైదరాబాద్ లో కుండపోత వాన బీభత్సం సృష్టించింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షాలు సిటీని ముంచెత్తాయి. రోడ్లు, కాలనీలు నదులను తలపిస్తున్నాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ పరిధిలో రికార్డ్ వర్షపాతం నమోదయ్యింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.
జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్ పేట, కృష్ణా నగర్ లో కాలనీలన్నీ నదులను తలపిస్తున్నాయి. కృష్ణా నగర్లో పలు కాలనీల్లో బైకులు కొట్టుకుపోయాయని స్థానికులు మొత్తుకుంటున్నారు. అమీర్ పేట,ఖైరతాబాద్, సెక్రటేరియట్, కంచన్ బాగ్, సిటీ శివారులోని ప్రాంతాల్లో భారీ వర్షం పడింది.
రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పలు చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో అపుడే బయటకు రావొద్దని హైడ్రా అధికారులు సూచిస్తున్నారు.
సెప్టెంబర్ 22న సాయంత్రం ఐదు గంటల వరకు హైదరాబాద్ లో నమోదయిన వర్షపాత వివరాలు ఇలా ఉన్నాయి
- షేక్ పేట్ : 8.3 సెం.మీ
- శ్రీనగర్ కాలనీ : 8 సెం.మీ
- వెంకటేశ్వర కాలనీ : 6.2 సెం.మీ
- అమీర్ పేట : 5.6సెం.మీ
- యూసఫ్ గూడ :5.4సెం.మీ
- హయత్ నగర్, ఎన్జీవో కాలనీ: 4.8సెం.మీ
- ముషిరాబాద్ : 4.8సెం.మీ
- బాల్ నగర్ : 3 సెం.మీ