రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు, మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారిందని, అది మరింత తీవ్రంగా మారే చాన్స్ ఉందన్నారు అధికారులు. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు పడతాయని తెలిపారు. హైదరాబాద్ సహా మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మేడ్చల్, రంగారెడ్డి , నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం , యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. కొద్ది రోజులుగా భారీ వర్షాలతో అల్లాడుతున్న హైదరాబాద్‌లో మళ్లీ వర్షం అనగానే ప్రజల భయాందోళన చెందే పరిస్థితి నెలకొంది.
