హైదరాబాద్లో క్లైమెట్ మారింది.. సిటీతో పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

హైదరాబాద్లో క్లైమెట్ మారింది.. సిటీతో పాటు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..

వాతావరణ కేంద్రం మరో బాంబు పేల్చింది. వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ అప్డేట్ వెల్లడించింది. గురువారం (సెప్టెంబర్ 11)  హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. 

హైదరాబాద్ లో ఉదయం నుంచి మేఘవృతమైన వాతావరణం కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.  నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో రెండు మూడు గంటల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రంర ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

 హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి,  రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ఇచ్చింది.  తేలికపాటి వర్షంతో పాటు ముసురు, పలు ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశం ఉదని ప్రకటించింది. 

తెలంగాణ వెదర్:

తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం (imd) వెల్లడించింది.  రెండు , మూడు గంటలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఈ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్: 

తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.  జోగులాంబ గద్వాల్, మెదక్, నాగర్ కర్నూల్, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి  జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) ఉంటుందని పేర్కొంది. దీంతో తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలతో పాటు మోస్తరు నుంచి భారీ  వర్షం ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం వుందని హెచ్చరించింది. 

ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్:

ఆదిలాబాద్, హైదరాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్,  రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వచ్చే 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

 గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కి.మీ కంటే తక్కువ (గాలులలో) ఉంటుందని, దీని కారణంగా తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు ఒకటి రెండు చోట్ల వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.