3 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

3 జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం

హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా సోమవారం 3 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ 3 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని పేర్కొంది.

హైదరాబాద్, మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని చెప్పింది. ఆదివారం ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, ములుగు జిల్లా తాడ్వాయిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది.