సూర్యాపేట జిల్లాలో భారీవర్షాలు..కోదాడలో భారీగా ట్రాఫిక్ జామ్

సూర్యాపేట జిల్లాలో భారీవర్షాలు..కోదాడలో భారీగా ట్రాఫిక్ జామ్

సూర్యాపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దాదాపు కోదాడ వరకు వాహనాలు నిలిచిపోయాయి. భారీ ట్రాఫిక్ జాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

కోదాడ డీఎస్సీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో పడ్డారు పోలీసులు. ఏపీకి వెళ్లే వాహనాలను నార్కట్ పల్లి-అద్దంకి జాతీయ రహదారికి రూట్ మళ్లించారు. కోదాడవైపు వాహనాలు రావొద్దని పోలీసులు సూచించారు. విజయవాడతో సహా.. సూర్యాపేటలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

ALSO READ | హైదరాబాద్లో ఎడతెరిపి లేని వర్షం..ఉప్పల్ లో భారీ ట్రాఫిక్ జామ్