
హైదరాబాద్ సిటిలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండావర్షంపడుతోంది..లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించి పోయింది..వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శనివారం( ఆగస్టు 31) సాయంత్రం ఉప్పల్ ప్రాంతంలో మేడిపల్లి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు వరంగల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
ALSO READ | Hyderabad: వర్షాల ఎఫెక్ట్.. సెప్టెంబర్ 2న పాఠశాలలకు సెలవు
కిలోమీటర్ల మేర రెండు వైపు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఉప్పల్ నుంచి వరంగల్ హైవే లో ఫ్లై ఓవర్ నిర్మాణపనులు జరుగుతుండటంతో , వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ లో వాహనాలు ఎటు పోలేని పరిస్థితి నెలకొంది.. పైనుంచి వర్షం పడుతోంది.. మరో వైపు ట్రాఫిక్ సమస్యతో వాహనాలు నానా ఇబ్బందులు పడ్డారు.