ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా.. ఎల్లంపల్లి టు సమ్మక్కసాగర్ దాకా అన్నీ ఓపెన్

ప్రాజెక్టుల గేట్లు ఖుల్లా.. ఎల్లంపల్లి టు సమ్మక్కసాగర్ దాకా అన్నీ ఓపెన్
  • కాళేశ్వరంతో ఎత్తిపోసిన నీళ్లు కిందికే.. సముద్రంలోకి 10 లక్షల క్యూసెక్కులు 
  • హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్.. ఉస్మాన్ సాగర్​కూ పెరిగిన వరద 
  • నిండుకుండలా హుస్సేన్ సాగర్.. ఇయ్యాల కూడా స్కూళ్లకు సెలవు 
  • అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు సీఎం కేసీఆర్​ ఆదేశం

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి, నీళ్లను కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి నుంచి సమ్మక్క సాగర్‌‌‌‌ వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేసి, దాదాపు 1‌‌‌‌0 లక్షల క్యూసెక్కుల నీళ్లను విడుదల చేస్తున్నారు. నిర్మల్‌‌‌‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఒక్కసారిగా వరద పెరగడంతో 14 గేట్లు ఎత్తారు. ఇక్కడ లక్షా 70 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. లక్షా 58 వేల క్యూసెక్కులు కిందికి వదులుతున్నారు. ఎల్లంపల్లి బ్యారేజీ‌‌కి ఈ వరదతో పాటు స్థానిక క్యాచ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఏరియా నుంచి కూడా లక్ష క్యూసెక్కుల ఇన్‌‌‌‌ఫ్లో వస్తున్నది. 

దీని కెపాసిటీ 20.175 టీఎంసీలు కాగా, నీటి నిల్వ ప్రస్తుతం 18.230 టీఎంసీలకు చేరింది. దీంతో 25 గేట్లు ఓపెన్​ చేసి 2,53,760  క్యూసెక్కులను సుందిళ్ల బ్యారేజీ‌‌‌‌‌‌‌‌కి, అక్కడి నుంచి 40 గేట్ల ద్వారా అన్నారం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. అయితే, అన్నారం బ్యారేజీకి మానేరు నుంచి కూడా ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో ఉండడంతో 56 గేట్లు ఓపెన్ చేసి, దాదాపు 3 లక్షల క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. ఈ నీళ్లతో పాటు ప్రాణహిత నుంచి దాదాపు 5.16 లక్షల క్యూసెక్కుల వరద మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీకి చేరుతున్నది. దీంతో ఇక్కడ 75 గేట్లు ఓపెన్ చేసి, వచ్చిన వరద వచ్చినట్టు రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఈ నీళ్లకు తోడు ఇంద్రావతి నది వరద కలవడంతో సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(తుపాకుల గూడెం) బ్యారేజీ‌‌‌‌‌‌‌‌కి 7.87 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తున్నది. ఇక్కడ 59 గేట్లు ఎత్తి, మొత్తం వరదను భద్రాచలం వైపు పంపిస్తున్నారు. భారీ వర్షాలతో భద్రాచలం దగ్గర లోకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ నుంచి వస్తున్న నీళ్లు కూడా కలవడంతో, ఇక్కడి నుంచి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల వరద  బంగాళాఖాతం వైపు వెళ్తున్నది. 

ఎత్తిపోసిన నీళ్లు కిందికి.. 

గోదావరిలో పెరిగిన వరద కారణంగా ప్రాజెక్టుల గేట్లు ఓపెన్ చేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోసిన నీళ్లు.. మళ్లీ దిగువకే వెళ్తున్నాయి. మేడిగడ్డ నుంచి 7 మోటార్లతో దాదాపు 9 టీఎంసీలు ఎత్తిపోయగా.. అందులో సగం నీళ్లను కూడా మిడ్​మానేరు, ఎస్సారెస్పీకి తరలించలేకపోయారు. ఈలోగా ఎల్లంపల్లికి వరద రావడంతో గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి ఎత్తిపోసిన నీళ్లను దిగువకు వదిలేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో ఈ నెల 3న కన్నెపల్లి దగ్గర మోటార్లు స్టార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అన్నారం, అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి వరకు వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఈ నెల 18 వరకు కన్నెపల్లి దగ్గర మోటార్లు నడిచాయి. 16 రోజుల్లో 9 టీఎంసీలను లిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఒక్కో బ్యారేజీ‌‌‌‌‌‌‌‌ నుంచి ఒక్కో స్థాయిలో వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగింది. కానీ ఇప్పుడు సీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రివర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. భారీ వర్షాల వల్ల ఎల్లంపల్లి మొదలుకుని సమ్మక్క సాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వరకు గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాల్సి వచ్చింది. దీంతో మొన్నటిదాకా సర్కారు కోట్లు ఖర్చు చేసి ఎత్తిపోసిన నీళ్లలో చాలా వరకు సముద్రం పాలవుతున్నాయి.