రుద్రప్రయాగ్: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, తుఫాన్ హెచ్చరికల కారణంగా కేదార్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. భారత వాతావరణ శాఖ ఆదివారం ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ప్రస్తుతం యాత్రా మార్గంలో ఉన్న వారందరినీ సమీపంలోని హోల్డింగ్ సెంటర్లకు తరలించాలని జిల్లా యంత్రాంగం అధికారులను ఆదేశించింది.
వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు. ‘‘రుద్రప్రయాగ్‌లో వాతావరణం చక్కబడే దాకా యాత్రికులు ముందుకు వెళ్లకుండా చూడాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని సెక్టార్ ను ఆదేశించాం” అని ఆయన చెప్పారు.
