భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భద్రాద్రికి పోటెత్తిన భక్తులు

భక్తులతో భద్రాద్రి కిటకిటలాడుతోంది. శని,ఆదివారాలు సెలవు రోజులు కావడం రామయ్య దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వరుసగా 2 రోజులు సెలవు దినములు కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి కాక ఇతర ప్రాంతాల నుంచి భక్తుల భద్రాద్రి శ్రీసీతారామచంద్ర స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. శని,ఆదివారాలు సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి క్యూలైన్ లలో భక్తులు సుమారు 2 గంటలపాటు వేచి వున్నారు.స్వామివారి కి కానుకలు సమర్పించి తమ తమ మొక్కులు చెల్లించుకున్నారు.ఆదివారం శ్రీసీతారామచంద్ర స్వామివారి మూలవరులకు అభిషేకం నిర్వహించి,సువర్ణ పుష్పాఅర్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ అర్చకులు.ఆదివారం ఉదయం స్వామివారి నిత్యకళ్యాణ వేడుకలో సుమారు 150 జంటలు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనం అనంతరం ఇటీవల తిరిగి ప్రారంభమైన పాపికొండల విహారయాత్రకు కూడా ఇటు  భక్త్తులు,అటు పర్యాటకులు అధిక సంఖ్య లో పయనమయ్యారు.2 రోజులపాటు రామాలయం ప్రాంగణం అంతా భక్తుల రద్దీతో కళకళ లాడింది.