ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్లోనే అంబులెన్స్లు

ఎల్బీ నగర్లో భారీగా ట్రాఫిక్ జామ్.. ట్రాఫిక్లోనే అంబులెన్స్లు

హైదరాబాద్ లో  పలు చోట్ల భారీ వర్షం పడింది. జూబ్లీహిల్స్, బంజారహిల్స్,పంజాగుట్ట, అమీర్ పేట్, ముషిరాబాద్, కూకట్ పల్లి, నిజాంపేట, దిల్ సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం,  ఉప్పల్ వంటి పలు చోట్ల భారీ వర్షం పడింది. దాదాపు గంట సేపటి నుంచి జోరు వాన పడింది.

 దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.   విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.  దాదాపు 5 కి.మీ మేర ట్రాఫిక్ జామ్ అయ్యింది.  అంబులెన్స్ లు ట్రాఫిక్ లోనే ఇరుక్కుపోయాయి. నీళ్లు భారీగా ఉండటంతో వాహనాలు కదలడం లేదు.  వరదలో కార్లు మునిగిపోయాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.