ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ : నరకం చూస్తున్న ప్రయాణికులు

ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్ : నరకం చూస్తున్న ప్రయాణికులు

ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామైంది. నగరాన్ని పొగ మంచు కప్పేయడంతో వెలుతురు తగ్గింది. రోడ్డు సరిగా కనిపించకపోవడంతో సాయంత్రం 4 గంటల నుంచి వాహనాలు స్లోగా వెళ్లాయి. దీంతో పలు మార్గాల్లో ఎక్కడికక్కడ వెహికిల్స్ నిలిచిపోయాయి. ఇండియా గేట్ దగ్గర ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోయింది. బారాపుల్లా ఏరియాలో కిలోమీటర్ల వరకు వాహనాల బారులు తీరాయి.

నాలుగు గంటలైనా ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి అలాగే ఉంది. చాలా మార్గాల్లో ట్రాఫిక్ జామైంది. దీంతో ట్రాఫిక్ లో చిక్కుకున్న ప్రయాణికులు నరకం చూస్తున్నారు. చాలా మంది వాహనాలను వదిలేసి మెట్రోలో జర్నీ చేస్తున్నారు. దీంతో రద్దీ పెరగడంతో పలు మెట్రో  స్టేషన్లను క్లోజ్ చేశారు అధికారులు.