Sanjay Leela Bhansali : హీరా మండి ఫస్ట్ లుక్ రిలీజ్

Sanjay Leela Bhansali : హీరా మండి ఫస్ట్ లుక్ రిలీజ్

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ నెట్ ఫ్లిక్స్ తో కలిసి తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ హీరా మండి.  ఈ ప్రాజెక్టుకు సంబంధించి నెట్ ఫ్లిక్స్, భన్సాలీ ప్రొడక్షన్స్ ఫస్ట్ లుక్, టీజర్ రిలీజ్ చేసింది. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. భన్సాలీ ట్రేడ్ మార్క్ గోల్డెన్ కలర్లో వీరంతా కనువిందు చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అందమంతా ఒక్క పోస్టర్లోనే ఉందా అన్నట్లు దాన్ని తీర్చిదిద్దారు. 


స్వాతంత్ర్యానికి పూర్వం లాహోర్ కు చెందిన వేశ్యల జీవిత విశేషాలను భన్సాలీ ఈ ప్రాజెక్టులో చూపనున్నారు. మరోసారి, మరో యుగం, మరో మాయా ప్రపంచంలో భాగస్వాములయ్యేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాం. హీరా మండి త్వరలో వస్తోందన్న క్యాప్షన్ తో  నెట్ ఫ్లిక్స్ సోషళ్ మీడియాలో టీజర్ రిలీజ్ చేసింది.