మేక చేను మేసిందని.. యువకుడిని నరికి చంపాడు

మేక చేను మేసిందని.. యువకుడిని నరికి చంపాడు

వికారాబాద్ : మేక చేను మేసిందని యువకుడిని దారుణంగా హత్య చేశాడు పొలం యజమాని. ఈ సంఘటన వికారాబాద్ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగింది. ధరూరు మండలంలోని ధర్మాపురం గ్రామానికి చెందిన బుద్ధ నరేష్(21) దగ్గర రెండు ఎద్దులు, ఒక మేక ఉంది. శుక్రవారం ఉదయం వాటిని మోపడననికి కంచెకు వెళ్లాడు నరేష్. తన చేనును మేక తింటుందని అదే గ్రామానికి చెందిన పొలం యజమాని రావులపల్లి అశోక్ నరేష్ ను తిట్టాడు.

దీంతో వీరి ఇద్దరి మద్య గొడవ పెరిగింది. అశోక్ కోపంతో చేతిలో ఉన్నకొడవళితో నరేష్ తలపై నరికాడు. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన అశోక్ కుటుంబ సభ్యుల అందరూ పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక హస్పిటల్ కు తరలించారు.