బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డెయిరీ రంగానికి మేలు.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ బ్రాహ్మణి

బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో డెయిరీ రంగానికి మేలు.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ బ్రాహ్మణి

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  పాడి, పశుసంవర్ధక రంగానికి ఎంతో మేలు ఉంటుందని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి అన్నారు. పశువైద్యుల  కొరతను తీర్చడానికి కొత్త కళాశాలలు, ఆస్పత్రుల ద్వారా 20 వేల మంది నిపుణులను పెంచడం గొప్ప పరిణామమని, ఇది పాడి రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు పశువుల ఆరోగ్యం, పాల దిగుబడి మెరుగుపడటానికి దోహదపడుతుందని తెలిపారు. రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు అందించడం వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడంలో తమ సంస్థ భాగస్వామ్యం అవుతుందని  పేర్కొన్నారు.