నటుడు కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

నటుడు కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్

యంగ్  హీరో కార్తీ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. "నా ఫేస్ బుక్ పేజీ హ్యాక్ అయ్యింది. మేము ప్రస్తుతం ఫేస్ బుక్ టీంతో కలిసి పనిచేస్తున్నాము.. త్వరలోనే అకౌంట్ ను తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తాము" అంటూ ట్వీట్ చేశారు. ఎప్పుడూ తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కార్తీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తమిళ, తెలుగు ప్రేక్షకులకు ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 

 

భాషతో సంబంధం లేకుండా కార్తీ అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఏడాది వరుస విజయాలతో ఆయన దూసుకెళ్తున్నారు. పొన్నియిన్‌ సెల్వన్‌ సినిమాతో అలరించిన ఈ హీరో సర్దార్‌తో భారీ విజయాన్ని అందుకున్నారు. వాటర్ బాటిల్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన సర్ధార్ చిత్రంలో కార్తీ అద్భుతంగా నటించారు. ప్రస్తుతం మురుగన్ దర్శకత్వంలో జపాన్ సినిమాలో ఆయన నటిస్తున్నారు. ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా అలరించనున్నారు.