నానికి 30వ సినిమా షురూ

నానికి 30వ సినిమా షురూ

డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు నాని. త్వరలో ‘దసరా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానున్న నాని..రీసెంట్‌‌గా  నెక్స్ట్ ప్రాజెక్ట్‌‌ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.  కొత్త దర్శకుడు శౌర్యువ్ రూపొందించనున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి, డా.విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి.కె.ఎస్ కలిసి నిర్మిస్తున్నారు.  మంగళవారం ఈ చిత్రాన్ని పూజా  కార్యక్రమాలతో ప్రారంభించారు. ముహూర్తం షాట్‌‌కు  చిరంజీవి క్లాప్‌‌ కొట్టగా,  అశ్వినీదత్ కెమెరా స్విచాన్ చేశారు.

దర్శకులు బుచ్చిబాబు, కిషోర్ తిరుమల, హను రాఘవపూడి, వశిష్ట, వివేక్ ఆత్రేయ కలిసి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. రచయిత విజయేంద్ర ప్రసాద్  మేకర్స్‌‌కి స్క్రిప్ట్‌‌ను అందజేశారు. నిర్మాతలు దిల్ రాజు, సురేష్​ బాబు, గోపి,- రామ్ ఆచంట, అనిల్ సుంకర, రవి శంకర్, డివివి దానయ్య, స్రవంతి రవి కిషోర్, కెఎస్ రామారావు, సాహు గారపాటి,  సునీల్ నారంగ్, అభిషేక్ అగర్వాల్, ‘పలాస’ ఫేమ్ కరుణ్ కుమార్, గిరీష్ అయ్యర్, దేవకట్టా, చోటా కె నాయుడు తదితరులు హాజరయ్యారు. ఇది నానికి 30వ సినిమా. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌‌.  రెగ్యులర్ షూటింగ్ ఈరోజు నుంచి హైదరాబాద్‌‌లో ప్రారంభం కానుంది.