రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం 'రణబాలి' . ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ అనంతపురం పరిసరాల్లో శరవేగంగా జరుగుతోంది. అయితే లేటెస్ట్ గా ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా నుంచి ఒక వీడియో నెట్టింట ప్రత్యక్షమై సంచలనం సృష్టిస్తోంది. షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఈ చిన్న క్లిప్, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇస్తూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది.
గుర్రంపై వీరవిహారం..
లీక్ అయిన వీడియో క్లిప్ లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ చూడని అత్యంత భీకరమైన లుక్‌లో కనిపిస్తున్నారు. తెల్లటి సంప్రదాయ దుస్తులు ధరించి, చేతిలో రక్తం చిందిన భారీ కొడవలి పట్టుకుని, గుర్రంపై వేగంగా దూసుకువస్తున్న ఆయన ఇచ్చిన ఎంట్రీ అదిరిపోయింది. ఈ సీన్ థియేటర్లలో ఈలలు వేయించేలా ఉంది. ఒక ఇరుకైన పల్లెటూరి వీధిలో జనం ప్రాణభయంతో పరుగులు తీస్తుండగా, విజయ్ తన గంభీరమైన వాయిస్‌తో డైలాగ్స్ చెప్తున్న తీరు సినిమాలోని ఇంటెన్సిటీని చాటిచెబుతోంది.
రక్తం చిందిన కొడవలి!
చుట్టూ రక్తం మడుగులో పడి ఉన్న మనుషులు, యుద్ధం జరిగిన అనవాళ్లు చూస్తుంటే, ఇది సినిమాలో వచ్చే ఒక భారీ యాక్షన్ బ్లాక్ అని అర్థమవుతోంది. పల్లెటూరి మట్టి వాతావరణం, సహజసిద్ధమైన సెట్టింగ్స్ ఈ విజువల్స్‌కు మరింత ప్రాణం పోశాయి. లీక్ అయిన వీడియోలో విజయ్ దేవరకొండ కళ్ళలో కనిపిస్తున్న కసి, ఆ పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే, ఆయన కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. పీరియడ్ డ్రామా కావడంతో నాటి కాలం నాటి ఆయుధాలు, వేషధారణపై దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు విజువల్స్ చెబుతున్నాయి. ఈ లీక్డ్ వీడియోతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
Leaked video from #RanaBaali Sets
— let's x Cinematica (@letsxCinematica) April 1, 2026
Get Ready to witness Mass Euphoria from #VDK 🔥 pic.twitter.com/8tgWPnKljC
'రియల్ కపుల్' మ్యాజిక్!
ఈ సినిమాకు ఉన్న మరో ప్రధాన ఆకర్షణ విజయ్ - రష్మిక మందన్న కాంబినేషన్. 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి హిట్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే వీరు గతేడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్న తర్వాత జంటగా నటిస్తున్న మొదటి చిత్రం ఇదే . ఈ చిత్రంలో విజయ్ 'రణబాలి' అనే టైటిల్ రోల్‌లో కనిపిస్తుండగా, రష్మిక 'జయమ్మ' అనే శక్తివంతమైన పాత్రలో నటిస్తోంది. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ చిత్రానికి ప్రధాన బలమని చిత్ర యూనిట్ భావిస్తోంది.
ఒక వీరోచిత గాథ!
'రణబాలి' కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు, 19వ శతాబ్దపు భారతీయ చరిత్రలోని కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న పీరియడ్ డ్రామా.1854 నుంచి 1878 మధ్య జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమచారాం. బ్రిటిష్ వలస పాలనలో భారతీయులు అనుభవించిన అణచివేతను ఇందులో చూపించబోతున్నారు.
ముఖ్యంగా సర్ రిచర్డ్ టెంపుల్, సర్ థియోడర్ హెక్టర్ వంటి క్రూరమైన బ్రిటిష్ అధికారుల విధానాలను ఎదిరించే విప్లవ వీరుడిగా విజయ్ పాత్ర ఉండబోతోందని టాక్. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరి బాక్సాఫీస్ వద్ద 'రణబాలి' ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
#Ranabaali Shooting at Anantapur pic.twitter.com/fhwLuaMDXk
— VD fan girl (@Kalpana_VDgirl) March 31, 2026
