20 ఏళ్ల ప్రయాణం.. ట్విటర్‌లో నితిన్ ఎమోషనల్‌ పోస్ట్‌

20 ఏళ్ల ప్రయాణం.. ట్విటర్‌లో నితిన్  ఎమోషనల్‌ పోస్ట్‌

2002 లో జయంతో ప్రేక్షకుల దిల్ గెలుచుకున్నాడు నితిన్.తర్వాత బాక్సాఫీసు దగ్గర సై అంటూ.. ధైర్యంగా నిలుచున్నాడు.అయితే ఈ టక్కరితో విక్టరీలు..దోబుచులాడాయి.అయినా..మరోసారి రెచ్చిపోయి..అపజయాలకు చెక్ పెట్టాడు.ఆడియన్స్ లో తన మీద ఇష్క్ ఏ రేంజ్ లో ఉందో..చూపించాలని భీష్మ ప్రతిష్ణ చేసాడు.గుండెజారి గల్లంతయ్యేంత విజయాలతో..మరోసారి హార్టులు దోచుకున్నాడు ఈ మాస్ట్రో.కెరీర్ లో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు.

టినేజ్ వయసులో తేజ దర్శకత్వంలో జయం మూవీతో అడుగు పెట్టిన నితిన్..మొదటి సినిమాతోనే హిట్ అంటే ఎంటో చూసాడు.ఈ కుర్రాడు లేతగా ఉన్నాడు అన్న వారికి..నెక్స్ట్ సినిమాతోనే..తనలోని .. మాస్ హీరోను చూపించాడు. వినాయక్ డైరెక్ట్ చేసిన దిల్ సినిమాతో..ఫైట్స్ చేసి నిరూపించాడు.ఈ మూవీ కూడా హిట్ కొట్టింది

కెరీర్ ఆరంభంలోనే వచ్చిన హిట్లను కంటిన్యూ చేయలేకపోయాడు నితిన్.సంబరం,శ్రీ అంజనేయం అంటు..అపజయాలను మూట గట్టుకున్నాడు.అయితే తర్వాత రాజమౌళి తో సై సినిమా చేసి..విజయాన్ని అందుకున్నాడు.మళ్లీ నితిన్ ట్రాక్ లో పడ్డాడు అనుకుంటుంటే..ఈయనతో విజయాలు దోబుచులాడాయి.సక్సెస్ అందని ద్రాక్షల మారింది.

సై తర్వాత వచ్చిన అల్లరి బుల్లోడు సినిమా నుండి..మారొ సినిమా వరకు..వరసగా 12 అపజయాలను చూసాడు.నితిన్ కెరీర్ ఖతం అని..విమర్శలు వచ్చేలా చేసాడు.అయితే ఇష్క్ సినిమా..అభిమానులకు..నితిన్ మీద ఎంత ఇష్క్ ఉందో చూపించింది.విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన..ఈ మూవీ విజయం సాధించి..నితిన్ ను హిట్ ట్రాక్ మీదికి తీసుకొచ్చింది.అభిమానులు సంబరాలు చేసుకునేల చేసింది.గుండెజారి గల్లంతయ్యిందే,హార్ట్ ఎటాక్ సినిమాలతో..మరో రెండు హిట్లను ఖాతాలో వేసుకున్నాడు.ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన..అఆ సినిమా..ఈయన మార్కెట్ ను పెంచేసింది.బాక్సాఫీసు దగ్గర యాభై కోట్లు రాబట్టింది

అయితే అఆ లాంటి హిట్ తర్వాత..లై,ఛల్ మోహన రంగా,శ్రీనివాస కళ్యాణం సినిమాలతో..హ్యాట్రిక్ ఫ్లాప్ లు మూట గట్టుకున్నాడు.ఈ సారి కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని ఫిక్సయ్యి...చెక్ లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్..భీష్మ లాంటి యూత్ ఫుల్ స్టోరీని ఎంచుకున్నాడు.వీటిలో భీష్మ హిట్ కొట్టి..మరోసారి విజయాల బండి ఎక్కించింది.అలాగే అంధాదూన్ రీమేక్ గా ఈ యువ కథానాయకుడు చేసిన..మాస్ట్రో..డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై ఆకట్టుకుంది.తొందర్లో మాచర్ల నియోజక వర్గం సినిమాతో రాబోతున్నాడు నితిన్..సినీ కెరీర్  20 ఇయర్స్ పూర్తి చేసుకున్న సందర్బంగా..జయంలో హీరోగా పరిచయం చేసిన దర్శకుడు తేజతో పాటు..ఇప్పటి వరకు తనతో వర్క్ చేసిన వారందరికి, అలాగే...తన అభిమానులకు ట్విట్టర్ పోస్ట్ ద్వారా థాంక్యూ చెప్పాడు.