
తెలుగులో ఇప్పుడిప్పుడే మార్కెట్ పెంచుకుంటున్నాడు తమిళ హీరో శివకార్తికేయన్. తను హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. సోమవారం ఈ మూవీ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ ఏడాది దీపావళికి విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. శివకార్తికేయన్ ఆకాశంలో ఎగురుతుండగా.. ఓ ఏలియన్ అతడితో పాటు కనిపిస్తోంది. ఇదొక సైన్స్ ఫిక్షన్ కామెడీ మూవీ. శరద్ కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఆర్.డి.రాజా నిర్మిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.