పంచకుల(హర్యానా): డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆదివారం ఉదయం టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ (టీబీఆర్ఎల్)లో నిర్వహించిన భారీ హైక్యాలిబర్ బాంబ్ టెస్ట్ సక్సెస్ అయింది. హర్యానాలోని పంచకుల జిల్లా రామ్‌గఢ్‌లో గల ఈ పరిశోధన కేంద్రంలో ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారుల సమక్షంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రయోగాన్ని చేపట్టారు.
భద్రతా నిబంధనలు పాటిస్తూ ఈ పరీక్షను పూర్తిచేశామని అధికారులు తెలిపారు. బాంబ్ టెస్ట్ నేపథ్యంలో టీబీఆర్ఎల్ సంస్థ, జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ హై-అలర్ట్ ప్రకటించాయి. ప్రయోగ సమయంలో ల్యాబ్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని సెన్సిటివ్ జోన్‌గా ప్రకటించారు.
