న్యూట్రీషియన్‌‌ కిట్ల టెండర్లకు హైకోర్టు అనుమతి

న్యూట్రీషియన్‌‌ కిట్ల టెండర్లకు హైకోర్టు అనుమతి

హైదరాబాద్, వెలుగు:  కేసీఆర్‌‌ న్యూట్రీషియన్‌‌ కిట్లకు చెందిన టెండర్ల ఖరారుకు హైకోర్టు అనుమతిచ్చింది. పైలెట్‌‌ ప్రాజెక్ట్-గా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రీషియన్‌‌ కిట్లు పంపిణీ చేసేందుకు ఆగస్టు 23న ప్రభుత్వం టెండర్లు పిలిచింది. టెండర్-లోని నిబంధనలు సరిగా లేవని పేర్కొంటూ లాన్‌‌ ఈ - గవర్నెన్స్‌‌ అండ్‌‌ ఎడ్యుకేషన్‌‌ ప్రైవేట్‌‌ లిమిటెడ్‌‌ కోర్టులో రిట్‌‌ దాఖలు చేసింది. దానిపై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు.  ఏజీ బీఎస్‌‌ ప్రసాద్‌‌ వాదిస్తూ.. న్యూట్రీషియన్‌‌ కిట్ల పంపిణీ స్కీంను దసరా కానుకగా సీఎం కేసీఆర్‌‌ ప్రారంభించాల్సి ఉందని.. అందుకు టెండర్ల ఖరారుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరారు. ఇరువాదనలు విన్న కోర్టు..  టెండర్లను ఖరారు చేసేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. టెండర్‌‌ చట్టబద్ధతపై తర్వాత వాదనలు వింటామంది.