V6 News

ఓపీఎస్ అమలుపై  హైకోర్టులో విచారణ

ఓపీఎస్ అమలుపై  హైకోర్టులో విచారణ

హైదరాబాద్, వెలుగు: కింది కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి ఓల్డ్‌‌‌‌‌‌‌‌ పెన్షన్‌‌‌‌‌‌‌‌ స్కీం అమలుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యర్శులు వ్యక్తిగతంగా హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2004లో మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కోర్టు జారీ చేసిన నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ వెలువడినప్పటికీ ఉద్యోగాల్లో 2005లో చేరగా పాత పింఛను పొందే అవకాశం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించారు.

దీనిపై విచారించిన హైకోర్టు కోర్టు ఉద్యోగుల అభిప్రాయాలను సేకరించి వారి అభ్యర్థన మేరకు పెన్షన్‌‌‌‌‌‌‌‌ పథకాన్ని వర్తింపజేయాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయకపోవడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్‌‌‌‌‌‌‌‌ దాఖలైంది. దీనిపై విచారించిన జస్టిస్‌‌‌‌‌‌‌‌ పి.శ్యాంకోశీ, జస్టిస్‌‌‌‌‌‌‌‌ నందికొండ నర్సింగ్‌‌‌‌‌‌‌‌రావులు పెన్షన్‌‌‌‌‌‌‌‌ పథకంపై ఉత్తర్వులను జూన్‌‌‌‌‌‌‌‌ 10లోగా అమలు చేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది.