
అమెరికా, రష్యా దేశాల మధ్య తొలిసారిగా ఉన్నత స్థాయి సంప్రదింపులు చోటుచేసుకున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాక్ సులివాన్ నిన్న రష్యా భద్రతా మండలి కార్యదర్శి తో మాట్లాడినట్టు శ్వేతసౌధం వెల్లడిచింది. ఉక్రెయిన్ పై రష్యా దాడిని అమెరికా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. దౌత్యం గురించి రష్యా సీరియస్ గా ఉంటే గనక తక్షణమే ఉక్రెయిన్ నగరాలు, పట్టణాలపై దాడులు మానుకోవాలని అమెరికా సూచించింది. సమావేశం అనంతరం ఉక్రెయిన్ కు 800 మిలియన్ డాలర్ల సైనిక సాయం చేస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్ కు మరింత సాయం చేస్తామని అమెరికా స్పష్టం చేసింది. రష్యా దళాలను దీటుగా తిప్పికొట్టేందుకు ఎయిర్ క్రాఫ్ట్ లు, ఆయుధాలు, డ్రోన్లు అందిస్తామని తెలిపింది.
మరో వైపు యుద్ధంపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్.. ప్రణాళిక ప్రకారమే ఉక్రెయిన్ పై ప్రత్యేక ఆపరేషన్ కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ యుద్ధంలో తాము తప్పక విజయం సాధిస్తామని చెప్పారు. పశ్చిమ దేశాలు రష్యా పై విధిస్తున్న ఆంక్షలు తమపై దురాక్రమణ కిందికి వస్తాయని.. ఇవి మమ్మల్ని ఏమీ చేయలేవన్నారు పుతిన్.
ఇవి కూడా చదవండి
నెట్ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేర్ చేస్తే అదనఫు ఛార్జీలు!